Pune airport: పూణే ఎయిర్ పోర్టు పేరు మార్పు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూణే ఎయిర్ పోర్టు పేరును మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

Update: 2024-09-23 14:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూణే ఎయిర్ పోర్టు పేరును మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పూణేలోని ‘లోహ్‌గావ్ విమానాశ్రయం’ పేరును ‘జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం’గా మార్చాలని నిర్ణయించారు. సోమవారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఓకే చెప్పిన ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే దీనికి కేంద్రం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సర్కారు డెసిషన్ పై కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ స్పందించారు. ‘పూణేలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి తుకారాం మహారాజ్ ఎయిర్ పోర్టుగా పేరు మార్చే దిశగా తొలి అడుగు పడింది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది’ అని తెలిపారు. అయితే ఈ పేరు మార్చాలనే సూచనను సైతం ఆయనే ఇచ్చినట్టు తెలుస్తోంది. 


Similar News