కంగనా.. మర్యాదగా క్షమాపణలు చెప్పు : కాంగ్రెస్ వార్నింగ్

కాంగ్రెస్(Congress) అధినాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) మీద బీజేపీ ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranouth) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది.

Update: 2024-09-23 13:00 GMT

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్(Congress) అధినాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) మీద బీజేపీ ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranouth) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. మర్యాదగా సోనియాకు క్షమాపణలు చెప్పాలని వార్నింగ్ ఇచ్చింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కేంద్రం వద్ద అప్పులు తీసుకొని.. ఆ సొమ్మును సోనియా గాంధీకి చేర వేస్తున్నాయి అంటూ ఆదివారం కంగనా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పు పట్టింది. సోనియా మీద చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేదంటే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో పరువునష్టం దావా వేస్తామని కంగనాను హెచ్చరించింది. కంగనా తీసిన 'ఎమర్జెన్సీ' సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వకపోవడం వల్ల, మతి చెడిందని ఆమె వ్యాఖ్యలు చూస్తే తెలుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ ఎద్దేవా చేశారు.    


Similar News