Sukma : లొంగిపోయిన నలుగురు మావోయిస్టులు.. సుక్మా జిల్లాలో సరెండర్

దిశ, నేషనల్ బ్యూరో : మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇచ్చిన పిలుపునకు స్పందన వచ్చింది.

Update: 2024-10-10 19:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇచ్చిన పిలుపునకు స్పందన వచ్చింది. నలుగురు మావోయిస్టులు గురువారం సుక్మా జిల్లాలో భద్రతా దళ సిబ్బంది ఎదుట సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిని మిడియం భీమా, సోది మున్నా అలియాస్ మనోజ్, ముచకీ దేవ, సూల ముచకీలుగా గుర్తించారు. వీరిలో మిడియం భీమా తలపై దాదాపు రూ.2 లక్షల రివార్డు ఉందని తెలిసింది. అతడు మావోయిస్టు పార్టీలోని ప్లాటూన్ నంబర్ 4లో క్రియాశీల సభ్యుడిగా పనిచేసే వాడని తేలింది.

లొంగిపోయిన మిగతా ముగ్గురు మావోయిస్టులు.. దిగువ క్యాడర్‌కు చెందిన వారని సమాచారం. ‘‘ఛత్తీస్‌గఢ్‌లో అమాయక గిరిజనులపై మావోయిస్టులు దాడులు చేస్తుంటే చూసి బాధ కలిగింది. అవి అమానవీయ దాడులు. మావోయిస్టు సైద్ధాంతిక భావజాలం డొల్లతనంతో కూడుకొని ఉంది. అందుకే మేం దాన్ని వదిలేసి, పోలీసులకు లొంగిపోయాం’’ అని సరెండర్ అయిన మావోయిస్టులు చెప్పుకొచ్చారు. 


Similar News