Congress: ఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. మాజీ ఎమ్మెల్యేపై ఆరేళ్ల పాటు సస్పెన్షన్ వేటు
లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీలోనే ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని షియో అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే అమీన్ ఖాన్, రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యదర్శి బాలేందుసింగ్ షెకావత్‌లపై భారీ ఎత్తున ఫిర్యాదు అందాయి. ఈ మేరకు ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న అధిష్టానం వాద్దిరిని పార్టీ నుంచి 6 సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.