చెన్నై ఎయిర్ షో విషాదం.. ఐదుకు చేరిన మృతులు, వందల మంది ఆస్పత్రిపాలు

చెన్నై(Chennai) మేరీనా బీచ్ ఎయిర్ షో(Air Show) విషాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.

Update: 2024-10-06 17:18 GMT

దిశ, వెబ్ డెస్క్ : చెన్నై(Chennai) మేరీనా బీచ్ ఎయిర్ షో(Air Show) విషాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఆదివారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) 92వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు దాదాపు 15 లక్షల మంది సందర్శకులు హాజరయ్యారు. ఎండవేడి తట్టుకోలేక వీరంతా ఒక్కసారిగా ఇళ్లకు వెళ్లేందుకు లోకల్ రైల్వే స్టేషన్ కు చేరుకోగా.. అక్కడ భారీగా తొక్కిసలాట జరిగింది. అనేక మందికి గాయాలు కాగా.. అక్కడిక్కడే ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. అయితే ఎండవేడికి 265 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. వీరిలో 96 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఆదివారం సెలవు దినం కావడంతో ఎయిర్ షో చూసేందుకు జనం ఇసుక వేస్తే రాలనంత మంది వచ్చారు. కానీ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎండ తీవ్రత తాళలేక ఇళ్లకు వెళ్లేందుకు లక్షల మంది ఒకేసారి రైల్వే స్టేషన్ కు చేరుకోవడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో సందరశుకులు రావడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు అని తెలుస్తోంది. 


Similar News