BREAKING: కంగనాను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ సస్పెండ్..

బాలీవుడ్ నటి, ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్‌ చంఢీగడ్ ఏయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది.

Update: 2024-06-06 16:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి, ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్‌ చంఢీగడ్ ఏయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఆమె ఢిల్లీకి వెళుతుండగా.. బాలీవుడ్ నటి, ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్‌ చంఢీగడ్ ఏయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది.ఎయిర్‌పోర్టు లాబీలో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెపై చేయి చేసుకుంది. ఈ క్రమంలోనే ఘటనపై షాక్ గురైన కంగాన సదరు ఉద్యోగినిపై పోలీసులు, అధికారులకు కూడా ఫిర్యాదు చేసింది. కాగా, అయితే కంగానా ర‌నౌత్ నిర‌స‌న తెలుపుతున్న రైతులను ఖ‌లీస్తానీ తీవ్రవాదుల‌తో పోల్చినందుకు కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ అమెను చంపదెబ్బ కొట్టిన‌ట్లుగా సోషల్ మీడియాలో వార్త ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో కంగనాను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌పై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దాడిపై సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆమెను అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. 

Similar News