సిద్ధరామయ్య దిగిపో.. సీఎం ముందే మ‌ఠాధిప‌తి సంచలన వ్యాఖ్య

దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటకలోని వొక్క‌లిగ వ‌ర్గానికి చెందిన ప్ర‌ముఖ మ‌ఠాధిప‌తి కుమార చంద్ర‌శేఖ‌ర‌నాథ స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-06-27 18:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటకలోని వొక్క‌లిగ వ‌ర్గానికి చెందిన ప్ర‌ముఖ మ‌ఠాధిప‌తి కుమార చంద్ర‌శేఖ‌ర‌నాథ స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు వ్య‌వ‌స్థాపకుడు కెంపెగౌడ 515వ జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మానికి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివ‌కుమార్ హాజరయ్యారు. ఈసందర్భంగా కుమార చంద్ర‌శేఖ‌ర‌నాథ స్వామీజీ ప్రసంగిస్తూ.. ‘‘సీఎం పదవి నుంచి సిద్ధరామయ్య దిగిపోయి.. డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్‌ను సీఎంగా చేయాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘ప్ర‌తి ఒక్క‌రూ సీఎం అయ్యారు. ఆ అధికారాన్ని అనుభ‌వించారు. మా వర్గానికి చెందిన డీకే శివ‌కుమార్‌కు మాత్ర‌మే సీఎంగా ఛాన్స్ దక్కలేదు. సిద్ధరామయ్య తలుచుకుంటేనే ఇది జరుగుతుంది. లేకపోతే జరగదు’’ అని స్వామీజీ వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో ప్రసంగించిన చెన్న‌గిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే బ‌స‌వ‌రాజు శివ‌గంగ కూడా ఇదే విధమైన డిమాండ్ చేశారు. దీనిపై సీఎం సిద్ధ‌రామ‌య్య రియాక్ట్ అవుతూ.. ‘‘కాంగ్రెస్ హైక‌మాండ్ ఈ అంశాన్ని చూసుకుంటుంది. మ‌నం ప్ర‌జాస్వామ్యంలో ఉన్నాం. హైక‌మాండ్ ఏది నిర్ణ‌యిస్తే అదే చేస్తాం’’ అని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉండాల‌ని మంత్రి కేఎన్ రాజ‌న్న‌ వ్యాఖ్యానించారు. వీర‌శైవ లింగాయ‌త్‌, ఎస్సీ-ఎస్టీలు, మైనార్టీల‌కు కూడా చెరొక డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌న్నారు. మంత్రి రాజన్నకు ఫోన్ చేసిన సీఎం సిద్ధరామయ్య.. ఇలాంటి విషయాలు నేరుగా హైకమాండ్‌తో చర్చించాలని, పబ్లిక్‌లో నోరు పారేసుకోవద్దని సూచించారు.

Similar News