ఇక ఆన్ లైన్‌లో నీట్-యూజీ పరీక్ష.. పరిశీలిస్తున్న కేంద్రం!

నీట్-యూజీ పరీక్షలో పేపర్ లీకేజీ వివాదం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచి నీట్-యూజీ పరీక్షను ఆన్ లైన్ పద్దతిలో నిర్వహించాలని భావిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Update: 2024-06-30 12:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నీట్-యూజీ పరీక్షలో పేపర్ లీకేజీ వివాదం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచి నీట్-యూజీ పరీక్షను ఆన్ లైన్ పద్దతిలో నిర్వహించాలని భావిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది నుంచి దీనిని అమల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్టు వెల్లడించాయి. దీనికి సంబంధించిన ప్రక్రియను నిపుణులతో చర్చిస్తున్నట్టు సమాచారం. పేపర్ లీకేజీ, పరీక్షల్లో అవకతవకలను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అయితే అన్ లైన్ మోడ్ వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సీరియస్ గా డిస్కస్ చేస్తున్నట్టు తెలిపారు.

పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించాలనే సూచనలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంగీకరించకపోవడంతో 2017 నుంచి నీట్ యూజీ పరీక్షను ఆఫ్ లైన్ మోడ్ లో నిర్వహిస్తున్నారు. అయితే పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీకేజీ వంటి ఆరోపణల నేపథ్యంలో ఆన్ లైన్ విధానానికే కేంద్రం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. కాగా, నీట్ యూజీ అనేది ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకునే విద్యార్థుల కోసం నిర్వహిస్తారు. మరోవైపు నీట్ పీజీ పరీక్షను మంగళవారం లోపు ప్రకటించే అవకాశం ఉంది.

Similar News