అదే వాస్తవ పరిస్థితి.. రికార్డుల్లో తొలగించిన వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్

లోక్ సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగంలోని కొన్నివ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించారు.

Update: 2024-07-02 07:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగంలోని కొన్నివ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించారు. కాగా.. ఆరికార్డులు తొలగించిన కొన్ని గంటలకే రాహుల్ గాంధీ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. రికార్డుల నుంచి తొలగించిన వ్యాఖ్యలు రూల్ 380 పరిధిలోకి రావని అన్నారు. తను ఏది చెప్పినా అది గ్రౌండ్ రియాలిటీ, వాస్తవ పరిస్థితి అని పేర్కొన్నారు. అయితే, తన ప్రసంగంలోని చాలా భాగాన్ని తొలగించడం చూసి ఆశ్చరపోయానని తెలిపారు. జూలై 2న లోక్‌సభలో జరిగిన చర్చలో తొలగించిన వ్యాఖ్యలు రూల్ 380 పరిధిలోకి రావన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 105(1)లో పొందుపరిచిన విధంగా.. ప్రజల భావాలను వ్యక్తికరించే స్వాతంత్య్రం ప్రతి సభ్యుడికి ఉందని అన్నారు. ఇది తన హక్కు అని.. దేశల ప్రజల పట్ల తన బాధ్యత అని తెలిపారు. తన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తీసివేయడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు విరుద్ధం అని చెప్పుకొచ్చారు. కాగా.. లోక్ సభలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగం గురించి ప్రస్తావించారు. అనురాగ్ ఠాకూర్ తీవ్ర ఆరోపణలు చేశారన్నారు. కానీ, ఆయన వ్యాఖ్యల నుంచి ఒక్క పదం కూడా తొలగించలేదని విమర్శించారు. తొలగించిన తన వ్యాఖ్యలను వెంటనే పునరుద్ధరించాలని పేర్కొన్నారు.

Similar News