సైబర్ కేటుగాళ్ల నయా మాయాజాలం.. ఏకంగా పోలీస్ ఆఫీసర్స్ ప్రొఫైల్‌తోనే లూటీ!
ఈ మధ్యకాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో సైబర్ నేరగాళ్లు తమ రూట్ మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఈ మధ్యకాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో సైబర్ నేరగాళ్లు తమ రూట్ మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులు సామాన్యుల పేర్లు, ఫోటోలతో ఫేక్ అకౌంట్ సృష్టించి వారి కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారికి మెస్సేజులు పెట్టి మోసాలకు పాల్పడేవారు. మరోవైపు రాజకీయ, సినీ ప్రముఖుల పేర్లతో ఫేక్ ఖాతాలు క్రియేట్ చేసి అకౌంట్లో డబ్బులు ఖాళీ అయ్యేలా లింక్‌లు పంపేవారు. అయితే సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు మరింత రెచ్చిపోయి.. ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్‌ల ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి డబ్బులు వసూళ్లలకు పాల్పడుతున్నారు. ఇటీవల వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేరుతో కూడా నకిలీ ఖాతా క్రియేట్ చేసి డబ్బులు పంపించాలని సందేశాలు పంపారు. తాజాగా పోలీస్ ఆఫీసర్ ప్రొఫెల్ పెట్టి కూడా వాట్సప్ మెసేజ్‌లు కేటుగాళ్లు పంపుతున్నారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ పోలీస్ ఆఫీసర్ ఫొటోతో సైబర్ కేటుగాళ్ల మాయాజాలం చేయడానికి ప్రయత్నించారు. సందేశాల్లో ఏపీకే లింక్స్ పంపి ఖాతాలో ఉన్న డబ్బును లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉన్నారు.