Bandi Sanjay: ఫుడ్ పాయిజనింగ్ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ నించి వచ్చిన వారసత్వం: బండి సంజయ్

స్కూల్స్ లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-11-27 06:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కలుషితాహారం వల్ల వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్  (Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఇప్పటికీ తమ ప్లేట్లలో విషమే తింటున్నారని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం నుంచి ప్రస్తుత కాంగ్రెస్  (Congress) ప్రభుత్వానికి ఫుడ్ పాయిజనింగ్ అనేది చేదు వారసత్వంగా వచ్చిందని ఆరోపించారు. మార్పు తీసుకువస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప పిల్లల దుస్థితిలో ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయిందని విమర్శించారు. ఈ పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం మాత్రమే కాదని ఆ పార్టీ నమ్మక ద్రోహనికి నిదర్శనం అని దుయ్యబట్టారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

నాడు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్:

బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అందించలేకపోవడం వల్ల విద్యార్థులు కష్టాల పాలవుతున్నారని విమర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే బేసిక్ బాధ్యతను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వర్తించలేకపోతే ఇక రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఎలా చెప్పుకోగరని నిలదీసారు. ఈ సందర్భంగా కేసీఆర్ హయాంలో జరిగిన ఫుడ్ పాయిజన్ (food poisoning) ఘటనపై నిలదీశిన ట్వీట్ ను బండి సంజయ్ రీ ట్వీట్ చేశారు.  

Tags:    

Similar News