CM Revanth: పేదల దేవుడు పీజేఆర్

పేద ప్రజలకు అన్ని వేళలా అండగా నిలిచిన గొప్ప వ్యక్తి పి.జనార్థన్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.

Update: 2024-12-28 16:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పేద ప్రజలకు అన్ని వేళలా అండగా నిలిచిన గొప్ప వ్యక్తి పి.జనార్థన్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. శనివారం పీజేఆర్ వర్థంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 1994 నుంచి 1999 వ‌ర‌కు సీఎల్పీ నేత‌గా ఆయ‌న ప‌నిచేసిన ఆయ‌న నిత్యం ప్రజా సమస్యల ప‌రిష్కారానికి పోరాడార‌ని, తెలంగాణ వాదానికి బ‌ల‌మైన గొంతుక‌గా నిలిచార‌ని సీఎం తెలిపారు. పీజేఆర్ చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు.

Tags:    

Similar News