MLC Kavitha: జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి నిజామాబాద్‌కు MLC కవిత
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi liquor scam case)లో అరెస్టై జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) నిజామాబాద్‌కు వస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi liquor scam case)లో అరెస్టై జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) నిజామాబాద్‌కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్ నేతలు, జాగృతి నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తొలుత ఇందల్వాయి టోల్ గేట్ వద్ద, అనంతరం డిచ్‌పల్లి వద్ద ఘనంగా స్వాగతం పలకనున్నారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత నేరుగా నిజామాబాద్‌లోని సుభాష్‌నగర్ తెలంగాణ తల్లి విగ్రహం వరకు చేరుకుంటారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలుకుతూ ఇప్పటికే నగరంలోని ప్రధాన కూడళ్లలో పెద్దపెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.