కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల దస్త్రంపై సీఎం సంతకం
గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న మూడు వేల మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెన్యువల్ చేసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న మూడు వేల మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెన్యువల్ చేసింది. గత కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న రెన్యువల్ ఫైల్ అంశంపై సోమవారం అసెంబ్లీలో సీఎం ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి సీతక్క ప్రత్యేకంగా భేటీ అయి చర్చించారు. గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల రెన్యువల్ అంశాన్ని సీఎం దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తు పై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో వెంటనే సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. మూడు వేలమంది టీచర్ల కుటుంబాలకు మేలు జరగడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.