SSA: ఉద్యోగులతో చర్చలు.. మంత్రి పొన్నం కీలక విజ్ఞప్తి

విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సర్వ శిక్షా ఉద్యోగులు(SSA) సమ్మె విరమించి విధుల్లో చేరాలని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) రిక్వెస్ట్(Request) చేశారు.

Update: 2024-12-30 16:54 GMT

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సర్వ శిక్షా ఉద్యోగులు(SSA) సమ్మె విరమించి విధుల్లో చేరాలని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) రిక్వెస్ట్(Request) చేశారు. సమ్మె చేస్తున్న సర్వ శిక్షా ఉద్యోగులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క(Minister Seethakka) చర్చలు జరిపారు. ఈ సందర్బంగా ఆయన.. గత 25 రోజులుగా సమ్మె చేస్తున్న దాదాపు 19,500 మంది సర్వ శిక్షా ఉద్యోగులు కేజీబీవి(KGBV) ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్ శ్రేయస్సు దృష్ట్యా తక్షణమే సమ్మె విరమించాలని కోరారు. సమ్మె చేయడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని, కేజీబీవీ పాఠశాలల్లో బడగు బలహీన వర్గాల పిల్లలు చదువుతున్నారని, సమ్మె చేస్తూ అక్కడ చదువుతున్న విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే తాము సుదీర్ఘ కాలంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో చేస్తున్నామని, తమని రెగ్యులరైజ్ చేయడం, ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కూల్ అమలు చేయాలని సర్వ శిక్షా ఉద్యోగులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు.

సర్వ శిక్షా కస్తూర్బా గాంధీ పాఠశాలు కేంద్రం పరిధిలో 60 శాతం రాష్ట్రం పరిధిలో 40 శాతం ఉంటుందని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) దృష్టికి తీసుకువెళ్ళినట్లు పొన్నం తెలిపారు. అంతేగాక సర్వ శిక్షా ఉద్యోగుల సమస్య తెలంగాణలోనే లేదని దేశ వ్యాప్తంగా ఉందని కేంద్ర ప్రభుత్వం కోరితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి, కేంద్రానికి ప్రతిపాదనలు పెడతామని వెల్లడించారు. ఇక 25 రోజులుగా కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మె చేయడం వల్ల వారికి విద్యాబోధన జరగక తీవ్రంగా నష్టపోతున్నారని, తక్షణమే సమ్మె విరమించి ఉద్యోగులు విధుల్లో చేరాలని కోరారు. సమ్మె విరమిస్తే వారి సమస్యల పై ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) నేతృత్వంలో ఏర్పడిన సబ్ కమిటీ(Cabinet Sub Committee)తో సమావేశానికి పిలుస్తామని సబ్ కమిటీలో తనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), ప్రభుత్వ సలహాదారు కేశవ రావు(Keshava Rao) కూడా ఉన్నారని, సబ్ కమిటీలో సర్వ శిక్షా ఉద్యోగుల సమస్యల పై చర్చిస్తామని తెలిపారు. నాన్ ఫైనాన్సియల్ డిమాండ్స్ లో మహిళా ఉద్యోగులకు మెటర్నరి లీవ్స్, సీఎల్‌లు తదితర వాటిపై సాధ్యమైనంత వరకు ప్రభుత్వం పరిష్కరమయ్యేలా ప్రభుత్వం చూస్తుందని, ఆర్థికపరమైన డిమాండ్స్ పై సబ్ కమిటీ లో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని పొన్నం ఉద్యోగులకు తెలియజేశారు.

Tags:    

Similar News