అరుదైన మొక్కలను తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
అరుదైన మొక్కలను తరలిస్తోన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ,వెబ్‌డెస్క్: అరుదైన మొక్కలను తరలిస్తోన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాధారణంగా కొన్ని రకాల మొక్కలు(plants) ఖరీదు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వివరాల్లోకి వెళితే.. అంతరించిపోతున్న మొక్కల్లో ప్రధాన స్థానంలో ఉన్న అరుదైన ఇంద్రజాల(Indrajala), మహేంద్రజాల(Mahendrajala) మొక్కల(plants)ను తరలిస్తున్న ఇద్దరిని డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 9.8 కిలోల ఇంద్రజాల 0.286 కిలోల మహేంద్రజాల మొక్కలు, 6 శంఖాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో ఒంగోలులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 6.64 కిలోల మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అంతరించిపోతున్న జాతుల్లో ఇవి ప్రధాన స్థానంలో ఉన్నాయని పోలీసులు తెలిపారు.