వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ఏసీపీ రమణ మూర్తి తెలిపారు.

Update: 2025-01-04 15:16 GMT

దిశ, ఖమ్మం సిటీ : వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ఏసీపీ రమణ మూర్తి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం టూ టౌన్ ఇన్స్పెక్టర్ బి. బాలకృష్ణ , సీసీఎస్ పోలీస్ సిబ్బందితో కలిసి శనివారం ఖమ్మం రాపర్తినగర్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి బ్యాగ్ తో అనుమానాస్పదంగా వచ్చాడు. దాంతో అతని బ్యాగ్ చెక్ చేయగా ఆ బ్యాగులో బంగారు, వెండి ఆభరణాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం అతనిని విచారించగా తన పేరు, గుగులోత్ నవీన్​ అని, మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నల్లగుండితండా గ్రామానికి చెందినట్టు తెలిపాడు.

    2024 డిసెంబర్ లో ఖమ్మం బై పాస్ రోడ్ లోని ఎస్ఆర్సీ టవర్స్ లోని అపార్ట్మెంట్ లో బంగారు, వెండి వస్తువులు దొంగిలించానని, 2024 ఆగస్టు నెలలో కుషాయిగూడ మేడ్చల్ దగ్గర ఒక స్కూటీ ని, డిసెంబర్ నెలలో మేడ్చల్ లో రెండు ఇండ్లలో దొంగతనాలు, డిసెంబర్ నెలలో హన్మకొండ లో ఒక ఇంట్లో దొంగతనం చేసినట్టు నిందితుడు తెలిపాడని పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకొని సొత్తు రికవరీ లో కీలకంగా వ్యవహరించిన ఖమ్మం టూ టౌన్ పోలీసులను, సీసీఎస్ ఏసీపీని పోలీస్ కమిషనర్ అభినందించారు. నిందితుడి నుంచి పలు బంగారు, వెండి ఆభరణాలు కలిపి రూ.18 లక్షల విలువైనవి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.  


Similar News