తాళం వేసిన ఇంట్లో దొంగల హల్‌చల్..

తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన దుబ్బాక మండలం

Update: 2025-01-06 16:10 GMT

దిశ,దుబ్బాక: తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై వి గంగరాజు,బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...రామక్కపేట గ్రామానికి చెందిన సంగేపు చిన్న బాలయ్య రాజమణి కలిసి ఇంటికి తాళం వేసి శనివారం రుద్రారం గ్రామంలో ఉన్న తమ బంధువుల అంత్యక్రియలకు వెళ్లారు. ఇంటికి తాళం వేసింది గమనించిన దుండగులు ఇల్లు తాళం పగల కొట్టి సుమారు రూ. 5 లక్షల నగదు, 8 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.ఆదివారం 5న రాత్రి 8 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి గుర్తుతెలియని వ్యక్తులు ఇళ్లు తాళం పగల కొట్టింది గమనించి బాధితులు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి ఇంట్లో సామాను చిందరవందరగా పడేసి ఇంట్లో ఉన్న రూ,5 లక్షల నగదు, 8 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు గమనించారు.

వెంటనే స్థానిక పోలిసులకు సమాచారం అందజేసినట్లు బాధితులు తెలిపారు.కూతుర్ల వివాహానికి కొరకు కూలి నాలి పని చేసి డబ్బు కూడబెట్టి,బంగారం కొని ఇంట్లోనే భద్రంగా పెట్టమని బాధితురాలు సంగేపు రాజమణి ఆవేదన వ్యక్తం చేశారు. దొంగతనానికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. సోమవారం రాత్రి సిద్దిపేట ఏసీపీ మధు, సీఐ పీ శ్రీనివాస్, ఎస్సై గంగరాజు తో కలిసి బాధితుడి ఇల్లు పరిశీలించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.బాధితుడు సంగేపు బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు.


Similar News