పోలీసుల కౌంటర్ పిటిషన్ లో కనిపించని పర్మిషన్ రిజెక్ట్ అంశం…

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితులైన ఏ1- పెద్ద రాంరెడ్డి,

Update: 2025-01-06 14:54 GMT

దిశ, సిటీ క్రైమ్ : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితులైన ఏ1- పెద్ద రాంరెడ్డి, చిన్న రామ్ రెడ్డి లకు నాంపల్లి కోర్టు సోమవారం రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది. రూ.25 వేల రెండు షూరిటీలు , ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ కు వెళ్ళి సంతకం పెట్టాలని కోర్టు సూచించింది.ఇప్పటి వరకు ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరీకి బెయిల్ వచ్చేసింది.

భోపాల్ గ్యాస్ దుర్ఘటన ప్రస్తావన..

ఈ బెయిల్ పిటిషన్ వాదనల్లో భారత దేశ చరిత్రలో నిలిచిపోయిన మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లో చోటు చేసుకున్న భోపాల్ గ్యాస్ దుర్ఘటనను ఏ-1, ఏ-2 తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. ఈ సంఘటనలో దాదాపు 5 వేల మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి అప్పట్లో మధ్య ప్రదేశ్ పోలీసులు గ్యాస్ కంపెనీ యాజమాన్యం పూ కూడా 304 పార్ట్ -2 ఐపీసీ తాజాగా 105 బీఎన్ఎస్(తన చర్య తో మరణం సంభవిస్తుందని తెలుసు, కానీ చంపాలని ఉద్దేశ్యం లేదు) కింద అభియోగం మోపారు. దీని పై కింది కోర్టు ఇచ్చిన తీర్పు మీద గ్యాస్ కంపెని యాజమాన్యం హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయించిన క్వాష్ పిటిషన్ ను వేసింది.

దీనిని విచారించిన కోర్టు ఈ సంఘటన యాక్సిడెంటల్ గా జరిగిందే తప్ప ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదని నమ్మిన కోర్టు పోలీసులు గ్యాస్ కంపెనీ మీద పెట్టిన కేసును స్క్వాష్ ను చేసిన తీర్పును వాదనల్లో నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ముందు పోలీసులు కౌంటర్ కు న్యాయవాదులు తమ వాదనను వినిపించారు. సంధ్య థియేటర్ కూడా గత 45 ఏండ్ల నుంచి నడుస్తుందని ఏ రోజు ఒక సంఘటన చోటు చేసుకోలేదని, ప్రేక్షకుడికి అవసరమయ్యే అన్ని భద్రతా చర్యలను తీసుకున్నామని వివరించారు. ఈ సంఘటన అనుకోకుండా జరిగిందే తప్ప ఎలాంటి ఉద్దేశం లేదని న్యాయవాదులు వాదించారు. ఇలా ఈ బెయిల్ పిటిషన్ సందర్భంలో భోపాల్ గ్యాస్ సంఘటన రావడం న్యాయవాద వర్గాల్లో ఆసక్తిని కలిగించింది.

పర్మిషన్ రిజెక్ట్ చేశామని పోలీసులు ఎక్కడా చెప్పలేదు..

మరో కీలక అంశాన్ని ఈ బెయిల్ పిటిషన్ వాదనల్లో నిందితులు తరపు న్యాయవాదులు న్యాయమూర్తికి వినిపించారు. ఏ-1, ఏ-2, ఏ-3, ఏ-9, ఏ-10 బెయిల్ పిటిషన్, క్వాష్ పిటిషన్, ముందస్తు బెయిల్ కు సంబంధించిన పిటిషన్ లను దాఖలు చేసినప్పుడు ఎక్కడ కూడా పోలీసులు తమ కౌంటర్ పర్మిషన్ ను రిజెక్ట్ చేశామని చెప్పలేదని, కేవలం సరైన అనుమతి తీసుకోలేదని పేర్కొనడాన్ని న్యాయవాదులు తప్పుపట్టారు. అన్ని అనుమతులు తీసుకున్నామని సంధ్య ధియేటర్ యాజమాన్యం రాతపూర్వకంగా ఇచ్చిన లేఖను కోర్టు పెట్టారు. అయితే పోలీసులు దీనిని రిజెక్ట్ చేసినట్లైతే పోలీసులు అనుమతిని రిజెక్ట్ చేశామని మా పిటిషన్ లకు దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ లో ఎందుకు పేర్కొనలేదని వాదనను గట్టిగా వినిపించారు. మరోవైపు పోలీసులు అనుమతిని రిజెక్ట్ చేసినట్లు మీడియాకు వచ్చిన లేఖ కూడా ఫేక్ గా సృష్టించారనే అనుమానాన్ని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అదే విధంగా ప్రభుత్వం ప్రీమియర్ షో కి ఇచ్చిన అనుమతికి సంబంధించి జారీ చేసిన మెమో లో లైసెన్స్ అథారిటీస్ , ట్రాఫిక్ పోలీసులు, జుడిషియల్ మెజిస్ట్రేట్, కలెక్టర్స్ దీనికి సంబంధించి ఉండే అన్ని ఏర్పాట్లను జాగ్రత్తగా మీరు చూసుకోవాలని మెమోలో పేర్కొన్న అంశాన్ని కోర్టుకు నిందితుల తరపు న్యాయవాదులు గుర్తు చేశారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని నాంపల్లి కోర్టు ఏ-1, ఏ-2 నిందితులకు బెయిల్ ను మంజూరు చేసింది.


Similar News