దంపతుల ప్రాణం తీసిన కుటుంబ కలహాలు..
అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.
దిశ,అమీన్ పూర్ : అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. అమీన్ పూర్ సీఐ సదా నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాలకు చెందిన దంపతులు సందీప్(30), కీర్తి (26) దంపతులు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధి బంధం కొమ్ము లోని శ్రీధం హిల్స్ లో నివసిస్తున్నారు. వీరికి 3 సంవత్సరాల ఒక పాప, 14 నెలల ఒక బాబు ఉన్నారు.
లక్షల్లో మంచి ఆదాయం ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ మంచి స్థితిలో ఉన్నారు. అయితే దంపతుల మధ్య చిన్నపాటి కుటుంబ కలహాలు చోటు చేసుకోవడంతో సోమవారం తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు ఇరువురు ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలిద్దరూ అనాధలుగా మిగిలిపోయారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అమీన్ పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం శవాలను పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.