China Manza: అటవీ శాఖ సంచలన ప్రకటన.. చైనా మాంజా అమ్మితే జైలుకే!

చైనా మాంజా(China Manza) అమ్మకాలపై తెలంగాణ అటవీ శాఖ(Telangana Forest Department) సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2025-01-06 15:59 GMT

దిశ, వెబ్ డెస్క్: చైనా మాంజా(China Manza) అమ్మకాలపై తెలంగాణ అటవీ శాఖ(Telangana Forest Department) సంచలన నిర్ణయం తీసుకుంది. చైనా మాంజా అమ్మితే ఐదేళ్లు జైలు శిక్ష(Prison sentence) విధించడంతో పాటు మాంజా రవాణా చేసే వాహానాలను సీజ్(Vehicle Sieze) చేస్తామని ప్రకటించింది. సోమవారం హైదరాబాద్(Hyderabad) లోని అరణ్య భవన్(Aranya Bhavan) లో అటవీ దళాల ప్రధాన సంరక్షణ ఆధికారి ఆర్ఎం డోబ్రియాల్(RM Dobriyal) ఆధ్వర్యంలో చైనా మాంజాపై ప్రజలకు అవగాహన, పక్షులను రక్షించేందుకు వాల్ పోస్టర్(Wall Poster) ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డోబ్రియాల్ మాట్లాడుతూ.. చైనా మాంజా అమ్మినా, నిలువ, రవాణా చేసినా ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

మాంజా వాడకం వల్ల మనుషులకు, పక్షులకు హాని జరిగితే 3 నుంచి 7 ఏళ్ల దాకా జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా ఉంటుందని హెచ్చరించారు. సంక్రాంతికి పతంగులతో పాటు పక్షులనూ ఎగరనిద్దామని పిలుపునిచ్చారు. గాలిపటాలు ఎగరవేసేందుకు కేవలం కాటన్ దారాలు మాత్రమే వాడాలని ప్రజలకు సూచించారు. ఎగరవేసే పతంగుల వల్ల పర్యావరణం, పక్షులకు హాని జరగకుండా చూడాలని కోరారు. నైలాన్, సింథటిక్ మాంజా (చైనా మాంజా) వాడకం వల్ల అనర్థాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. కేంద్ర పర్యావరణ చట్టం (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు – 2016)(National Green Tribunal) ప్రకారం చైనీస్ మాంజా వాడకాన్ని నిషేధించినట్లువెల్లడించారు. ఇప్పటివరకు 28 లక్షల విలువైన 1391 కిలోల దాకా చైనీస్ మాంజా సీజ్ చేశామని తెలిపారు. చైనా మాంజా దిగుమతితో స్థానికంగా కాటన్ తో పంతుగుల దారం తయారు చేసేవాళ్లు ఉపాధి కోల్పోతున్నారన్నారు. పండగ సీజన్ లో నిఘా కోసం ప్రత్యేకంగా ఐదు టీమ్ లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. చైనా మాంజా వివరాలు తెలిస్తే అటవీ శాఖ టోల్ ఫ్రీ 040 -23231440, 1800 4255 364 తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్(కంపా) సువర్ణ, వైల్డ్ లైఫ్(ఓఎస్డీ) శంకరన్, డీసీఎఫ్ లు ప్రకాష్, సమిత పాల్గొన్నారు.

Tags:    

Similar News