తాగుడుకు బానిసై వ్యక్తి ఆత్మహత్య

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్ గ్రామంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2025-01-04 16:01 GMT

దిశ, మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్ గ్రామంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కోసన రాజు తెలిపిన వివరాల ప్రకారం ముత్యంపేట్ గ్రామానికి చెందిన బండారి మోహన్(38) గత కొంత కాలం నుండి తాగుడుకు బానిసై మనస్థాపానికి గురై జీవితం మీద విరక్తి చెంది ఓ పాడుబడిన ఇంటిలోని రేకుల వాసానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తమ్ముడు బండారి రమేష్ ఫిర్యాదు మేరకు పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Similar News