కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య..

కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకుంది

Update: 2025-01-04 16:09 GMT

దిశ, గీసుగొండ : కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గీసుగొండ సీఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన బొల్లు సుభద్ర కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో 16/12/2024 రోజున ఉదయం 9:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని పురుగుల మందు తాగి డబ్బాను పడేస్తుండగా ఇంటి పక్కన ఉన్న అక్కిలి రంజిత్ చూసి ఆమె భర్త మొగిలికి తెలిపాడు. మొగిలి వెంటనే ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 1:50 గంటలకు చనిపోయిందని డాక్టర్లు ధృవీకరించారు. గత ఐదు సంవత్సరాల నుంచి సుభద్ర కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేదని, ఆస్పత్రిలలో చూపించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని సుభద్ర భర్త మొగిలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.


Similar News