హైదరాబాద్ CP ఆనంద్‌కు MLC కవిత ఫోన్

హైదరాబాద్ పోలీస్ కమిషనర్(Hyderabad Police Commissioner) సీవీ ఆనంద్‌(CV Anand)కు బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) ఫోన్ చేశారు.

Update: 2025-01-02 13:37 GMT
హైదరాబాద్ CP ఆనంద్‌కు MLC కవిత ఫోన్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్(Hyderabad Police Commissioner) సీవీ ఆనంద్‌(CV Anand)కు బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) ఫోన్ చేశారు. నగరంలోని ఇందిరా పార్క్ వద్ద శుక్రవారం తలపెట్టిన ‘బీసీ సభ’కు అనుమతి ఇవ్వాలని గురువారం ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు. సావిత్రిబాయి ఫూలే జయంతి(Savitribai Phule Jayanthi) సందర్భంగా సభ తలపెట్టామని అన్నారు. కాగా, ఇప్పటికే సభ సన్నాహాలపై కవిత బీసీ సంఘాలతో విస్తృతంగా సమావేశాలు జరిపరు. మహాసభ పోస్టర్‌ సైతం ఆవిష్కరించారు. అంతకుముందు ఆమె.. సభ గురించి మీడియాతో మాట్లాడారు. బీసీ మహాధర్నాకు జిల్లాల నుంచి భారీ స్పందన లభిస్తోందని చెప్పారు. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Declaration) పేరిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపడుతున్నట్లు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News