మే 7 నుంచి ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె
తెలంగాణ రాష్ట్ర ( Telangana) ప్రయాణికులకు ( Passengers) బిగ్ అలర్ట్. ఆర్టీసీ కార్మికులు ( RTC workers ) నిరవధిక సమ్మెకు

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ( Telangana) ప్రయాణికులకు ( Passengers) బిగ్ అలర్ట్. ఆర్టీసీ కార్మికులు ( RTC workers ) నిరవధిక సమ్మెకు రెడీ అవుతున్నారు. మే 7వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె ( strike) జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీoతో తెలంగాణ రాష్ట్రంలో మీ ఆరవ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు ( RTC Buses) బంద్ కానున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ పరిరక్షణ అలాగే విలీన ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ... ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతుంది.
ఈ మేరకు ఈ నెల ప్రారంభంలోనే ఈ విషయాన్ని ప్రకటించారు ఆర్టీసీ ఉద్యోగులు. ఆ సందర్భంగా... ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న (eeduru venkanna) కూడా.. తమ సమస్యలను తెరపైకి తీసుకువచ్చారు. ఆయన ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ ఆఫీస్ కు వెళ్లి 21 డిమాండ్లతో కూడిన లేఖను కమిషనర్ కు అందించారు. ఎన్నిసార్లు సమ్మె నోటీసు ఇచ్చినా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పందించడం లేదని, అటు ఆర్టీసీ యాజమాన్యం అలాగే వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని... ఆర్టీసీలో యూనియన్లను అనుమతించి ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. లేనియెడల మే ఏడో తేదీన సమ్మెకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు.
మే 7 నుండి ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె
— Telugu Scribe (@TeluguScribe) April 29, 2025
తెలంగాణలో మే 6 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్
ఆర్టీసీ పరిరక్షణ, విలీన ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ https://t.co/7pqmeq4bw9 pic.twitter.com/IwzgVPLxu8