KCR కుటుంబంపై MLA కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబంపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Update: 2025-01-02 13:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబంపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పదేళ్ల పాటు కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకున్నదని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత జైలుకు వెళ్లి వచ్చారు.. ఫార్ములా ఈ-రేస్ కార్ కేసులో కేటీఆర్ కూడా జైలుకు వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలోని వారంతా నిజాయితీ పరులైతే.. ఒక్కొక్కరిపై ఇన్ని కేసులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. 2014లో కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఆస్తి ఎంత.. ఇప్పుడు ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తి ఎంతో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని అడిగారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్, హరీష్ రావు అనేక విధాలుగా తప్పులు చేశారని ఆరోపణలు గుప్పించారు. గొప్పలకు పోయి ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ప్రతీ పథకంలోనూ అక్రమాలు చేశారని అన్నారు. దళితబంధు, రైతుబంధు ఇలా అనే పథకాల్లో అక్రమాలు చేశారని ఆరోపించారు. దళితబంధులో కమీషన్ తీసుకొని ఇప్పుడు నీతులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. తాను ఎక్కడైనా తప్పుచేస్తే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలి అని రిక్వెస్ట్ చేశారు.

Tags:    

Similar News