Pushpa 2 : పుష్ప 2 షో తొక్కిసలాటపై సెటైరికల్ సాంగ్ వైరల్
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంధ్య థియేటర్ (Sandhya Theatre) పుష్ప 2(Pushpa 2 Show) ప్రిమియర్ షో తొక్కిసలాట ఘటన(Stampede Incident)పై విడుదలైన సెటైరికల్ ఫోక్ సాంగ్(Satirical Folk Song) సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.
దిశ, వెబ్ డెస్క్ : దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంధ్య థియేటర్ (Sandhya Theatre) పుష్ప 2(Pushpa 2 Show) ప్రిమియర్ షో తొక్కిసలాట ఘటన(Stampede Incident)పై విడుదలైన సెటైరికల్ ఫోక్ సాంగ్(Satirical Folk Song) సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. తొక్కిసలాట ఘటన..అల్లు అర్జున్ అరెస్టు పరిణామాలు..ప్రేక్షకులు..అభిమానుల కష్టనష్టాలు..బౌన్సర్లు దాడులు..హీరోల వైఖరులను పాటకు సాహిత్యంగా మలుచుకుని వ్యంగ్య విమర్శలతో రూపొందించిన సైటైరికల్ సాంగ్ ఆలోచనాత్మకంగా సాగింది. టికెట్లు మేమే కొనాలి..చప్పట్లు మేమే కొట్టాలి...చావులు మేమే చావాలి..సంపాదన మేమే కావాలంటూ పాటలో ప్రస్తుత పరిణామాలపై వంగ్యాస్త్రాలు సంధించారు. పైసతోనే పాణంగుంటారా మీ పెద్ధమనుషులు..మీ వల్లే చచ్చిన మనిషిని చూడరావు మనసులు అంటూ విమర్శలు గుప్పించారు.
ముందేమో కన్నీళ్లు పెట్టాలి..వెనుకేమో బూతులు తిట్టాలి..పైకేమో ప్రేమలు చూపాలి..లోపల కసురుకోవాలి... మీరు జైలుకెళ్లినా..భగత్ సింగ్ లా ఫోజులు కొట్టాలి..మీ గేటు ముందు పోటుగాళ్లు క్యూలు కట్టాలంటూ చురకలేశారు. సెల్ఫీలు మేం అడగాలి..చెంపలు మావే పలగాలి..కటౌట్లు మేం కట్టాలి..గెటౌట్లు మాకే దక్కాలి...బౌన్సర్లతో బలుపు చూపి బయటకు నూకాలి..జర యాదించుకో ఏ సినిమా అయినా మేమే చూడాలంటూ హెచ్చరించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, పాట సాగిన తీరు ప్రభుత్వ వైఖరికి మద్ధతుగా, అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా ఉన్నట్లుగా బన్నీ అభిమానులు భావిస్తున్నారు.
Read More...
‘పుష్ప-2’లో ఓ ఊపు ఊపిన పాట.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసిందోచ్