CM Revanth Reddy : అవినీతి నుంచి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం : సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు(Triumph of public governance) జరుపుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు(Triumph of public governance) జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో చివరి రోజైన నేడు సచివాలయ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. పదేళ్ళ అవినీతి నుంచి అభివృద్ధి వైపు తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఉద్యమకారుల ఆకాంక్షలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఉద్యమ సమయంలో యువకులు, ఉద్యమకారులు తమ గుండెలపై టీజీ(TG) అని రాసుకున్నందున.. రాష్ట్రం పేరును టీఎస్ నుంచి టీజీగా మార్చమన్నారు. ఉద్యమంలో ఉర్రూతలూగించిన జయజయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ(Andesri) గారిని గౌరవించుకొని, ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించామని అన్నారు. ఉద్యమంలో వివిధ పార్టీలు వారికి అనుగుణంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకున్నారని.. కాని తెలంగాణలోణి మన తల్లుల మాదిరిగా ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి, ఆవిష్కరించుకున్నామని తెలియజేశారు. డిసెంబర్ 9వ తేదీని ఇకనుంచి ప్రతీ ఏడాది తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ దినంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.