న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా బన్సూరి స్వరాజ్ నియామకం

న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ నియమితులారయ్యారు. జూలై 3న ఎన్డీఎంసీ సభ్యురాలిగా బన్సూరిని నియమిస్తున్నట్లు కేంద్రహోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Update: 2024-07-04 11:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ నియమితులారయ్యారు. జూలై 3న ఎన్డీఎంసీ సభ్యురాలిగా బన్సూరిని నియమిస్తున్నట్లు కేంద్రహోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. దివంగత బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్ కుమార్తెనే బన్సూరి స్వరాజ్. ప్రస్తుతం, బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత పదేళ్లుగా మీనాక్షి లేఖి ఈ పదవిలో కొనసాగారు. ప్రస్తుతం, బన్సూరి స్వరాజ్ ఎన్డీఎంసీ సభ్యురాలిగా కొనసాగనున్నారు.

న్యూఢిల్లీ మున్సిపాలిటీలో ఎన్డీఎంసీ సభ్యులదే కీలక పాత్ర

న్యూ ఢిల్లీ మున్సిపల్ ఏరియాలో మున్సిపాలిటీ సేవలు, పరిపాలనలో ఎన్డీఎంసీ సభ్యులు కీలక పాత్ర పోషిస్తారు. భూమి వినియోగం, జోనింగ్ నిబంధనలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ ప్రణాళికకు సంబంధించిన విధానాల రూపకల్పన, అమలుకు సభ్యులు సహకరిస్తారు. అంతేకాకుండా, నీటి సరఫరా, విద్యుత్, మురుగునీరు, వ్యర్థాల నిర్వహణ వంటి అవసరమైన ప్రజాసేవలు అందిచడం, నిర్వహిణను పర్యవేక్షించే బాధ్యత కూడా ఉంటుంది. బడ్జెటింగ్ ప్రక్రియలో పాల్గొనడం, వ్యయాలను ఆమోదించడం, కౌన్సిల్ కార్యకలాపాలలో ఆర్థిక క్రమశిక్షణను నిర్ధారించాలి. ఇవే కాకుండా పౌరులకు, కౌన్సిల్‌కు మధ్య అనుసంధానకర్తగా పనిచేయాలి. ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడం, ఆందోళనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది.


Similar News