యూపీలో 80కి 80 సీట్లు గెలిచినా ఈవీఎంలను నమ్మం: అఖిలేష్ యాదవ్

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో మాట్లాడుతూ, ఈవీఎంలు, పేపర్ లీక్‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు

Update: 2024-07-02 08:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో మాట్లాడుతూ, ఈవీఎంలు, పేపర్ లీక్‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మొత్తం 80కి 80 లోక్‌సభ స్థానాల్లో మేము విజయం సాధించిన కూడా ఈవీఎంలను విశ్విసించనని అఖిలేష్ అన్నారు. వాటిపై నాకున్న అభిప్రాయాన్ని మార్చడానికి ఇష్టపడను, ఈవీఎంలు ఎప్పుడు సమస్యగానే ఉంటాయి. ఇంతకుముందు కూడా నేను వాటిని నమ్మలేదు, ఇప్పుడు కూడా నమ్మను, ఈవీఎంల వినియోగాన్ని నిలిపివేసే వరకు ఇది ఎప్పటికీ అలాగే ఉంటుందని స్పష్టం చేశారు.

ఇంకా పేపర్ లీక్‌లపై మాట్లాడిన ఆయన, పేపర్ లీకేజీలు ఎందుకు జరుగుతున్నాయి, యువతకు ఉద్యోగాలు ఇవ్వకూడదని ప్రభుత్వం ఇలా చేస్తోందన్నది వాస్తవం అని అఖిలేష్ అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి బదులుగా, వాటిని లాక్కుంటుంది. రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆయన కేంద్రంపై విమర్శలు చేశారు. అగ్నిపథ్ పథకం గురించి మాట్లాడిన అఖిలేష్, ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ దీనిని సమీక్షించాలని కోరారు.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, ఈ ఆర్మీ రిక్రూట్‌మెంట్ పథకాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఇంకా కుల గణనకు తాము మద్దతు ఇస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సభ్యుల సంఖ్య తగ్గడంపై అఖిలేష్ యాదవ్‌ విమర్శలు గుప్పిస్తూ, ఎన్నికల సమయంలో 400 సీట్లు అని వారు ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రజలు దానికి ఒప్పుకోలేదు. అందుకే వారు ప్రతిపక్ష ఇండియా కూటమికి నైతిక విజయం అందించారని అన్నారు.

Similar News