ఎన్టీఏకు సుప్రీంకోర్టు నోటీసులు..కారణమిదే?

లెర్నింగ్ యాప్ కమ్-కోచింగ్ సెంటర్, కొంతమంది నీట్ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. జూలై 8వ తేదీలోగా సమాధానమివ్వాలని ఆదేశించింది.

Update: 2024-06-27 18:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లెర్నింగ్ యాప్ కమ్-కోచింగ్ సెంటర్, కొంతమంది నీట్ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. జూలై 8వ తేదీలోగా సమాధానమివ్వాలని ఆదేశించింది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్‌విఎన్ భట్టిలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. నీట్ మార్కుల గణనలో ఎన్టీయే ఇష్టానుసారంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ..లెర్నింగ్ యాప్ కమ్-కోచింగ్ సెంటర్ పిటిషన్ దాఖలు చేసింది. పరీక్షకు హాజరైన విద్యార్థులకు ఓఎంఆర్ షీట్లు మంజూరు చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. మిగిలిన అన్ని పిటిషన్లను కలిపి ఒకే రోజు విచారిస్తామని స్పష్టం చేసింది. ఓఎంఆర్ షీట్‌లకు సంబంధించి ఫిర్యాదులను లేవనెత్తడానికి ఏదైనా గడువు ఉందా అని అత్యున్నత న్యాయస్థానం ఎన్టీఏను ప్రశ్నించగా.. ఓఎంఆర్ షీట్లు అప్‌లోడ్ చేసి ఏవైనా ఫిర్యాదులుంటే పరిష్కరిస్తామని తెలిపింది.

Similar News