లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా అయోధ్య ఎంపీ ?

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవికి సంబంధించిన ఎన్నికకు త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Update: 2024-06-30 13:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవికి సంబంధించిన ఎన్నికకు త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికలోనూ తమ అభ్యర్థిని నిలిపే దిశగా విపక్ష ఇండియా కూటమి ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన చేసింది. ఉత్తరప్రదేశ్‌లో అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్‌ పేరును డిప్యూటీ స్పీకర్ పోస్టు కోసం పరిశీలించాలని కోరింది.

దళిత వర్గానికి చెందిన బలమైన నేతగా పేరొందిన అవధేష్ ప్రసాద్‌‌కు ఈ ప్రతిష్టాత్మక పదవిని కేటాయించాలని టీఎంసీ పేర్కొంది. ఫైజాబాద్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌పై 50వేల పైచిలుకు ఓట్ల తేడాతో అవధేష్ ప్రసాద్‌ గెలిచారు. ఒకవేళ తమకు డిప్యూటీ స్పీకర్ పోస్టును కేటాయించకుంటే.. ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో పోటీచేసే అవకాశం ఉంది.

Similar News