టీ20 క్రికెట్‌కు జడేజా రిటైర్మెంట్.. ప్రధాని మోడీ స్పెషల్ విషెస్

శనివారం రాత్రి జరిగిన 2024 టీ20 ఫైనల్‌లో భారత్ గెలచి టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్ అనంతరం భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపారు.

Update: 2024-06-30 13:14 GMT

దిశ, వెబ్ డెస్క్: శనివారం రాత్రి జరిగిన 2024 టీ20 ఫైనల్‌లో భారత్ గెలచి ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్ అనంతరం భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఆయన ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. ఈ క్రమంలోనే ప్రముఖ క్రికెటర్లు జడ్డు రిటైర్మెంట్ పై స్పందిస్తూ.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ జడేజా రిటైర్మెంట్ పై స్పందించారు. ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ స్పందిస్తూ.. "ప్రియమైన జడేజా.. భారత జట్టులో మీరు ఆల్‌రౌండర్‌గా ఎంతగానో రాణించారు. క్రికెట్ ప్రేమికులు మీ స్టైలిష్ స్ట్రోక్ ప్లే, స్పిన్, అద్భుతమైన ఫీల్డింగ్‌ని ఎల్లప్పుడు మెచ్చుకుంటారు. భారత జట్టు కోసం ఏళ్ల తరబడి టీ20లో అద్భుత ప్రదర్శన చేసినందుకు ధన్యవాదాలు" అని రాసుకొచ్చారు.


Similar News