టీ20 ఉమెన్స్ వరల్డ్‌కప్.. తొలిసారి పాక్‌ను నమ్ముకున్న టీమిండియా!

టీ20 మహిళల వరల్డ్ కప్‌ టోర్నీలో భారత్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో ఆస్ట్రేలియా ఉమ్మెన్స్ టీం మరోసారి టీమిండియాను ఓడించి సెమీస్ ఆశలపై నీళ్లు చల్లింది.

Update: 2024-10-13 19:42 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 మహిళల వరల్డ్ కప్‌ టోర్నీలో భారత్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో ఆస్ట్రేలియా ఉమ్మెన్స్ టీం మరోసారి టీమిండియాను ఓడించి సెమీస్ ఆశలపై నీళ్లు చల్లింది.ప్రపంచకప్ ఆరంభంలో గ్రూప్ -ఏ స్టేజీలో తొలి మ్యాచ్ న్యూజిలాండ్ చేతిలో ఓడిన హర్మన్ ప్రీత్ సేన.. ఆ తర్వాత వరుసగా పాకిస్తాన్, శ్రీలంక జట్ల మీద అద్భుతమైన విజయాలు నమోదు చేసింది. మూడు మ్యాచులు గెలిస్తే టీమిండియా నేరుగా సెమీస్‌‌కు క్వాలిఫై అయ్యేది. ఈ క్రమంలోనే ఇవాళ్టి మ్యాచులో ఆసీస్‌పై భారత జట్టు గెలిస్తే సెమీస్ ఆశలు సజీవంగా ఉండేవి. అనుకోకుండా ఓటమిపాలైంది. భారత్ ప్రస్తుతం టీమిండియా సెమీస్ చేరాలంటే ఒకేదారి కనిపిస్తున్నది. ఈనెల 14న జరిగే న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచులో దాయాది దేశం విజయం సాధిస్తే ఇండియా సెమీస్‌కు వెళ్లే చాన్సెస్ ఉన్నాయి. నెట్ రన్ రేట్ ఆధారంగా ఆ చాన్స్ ఇండియాకు ఉంది. ఒకవేళ కివీస్ గెలిస్తే ఆ జట్టు సెమీస్ చేరుకుంటుంది.. అప్పుడు ఇండియా ఇంటిదారి పట్టాల్సి వస్తుంది.

టార్గెట్ తక్కువే.. కానీ!

ఆస్ట్రేలియా నిర్దేశించిన 151 పరుగుల లక్ష్య ఛేద‌న‌లో భార‌త జ‌ట్టు కీల‌క వికెట్లు కోల్పోయింది. ఆరంభం అదిరినా ఆసీస్ బౌల‌ర్లు పుంజుకున్నారు.దీంతో టీమిండియా క‌ష్టాల్లో ప‌డింది. ప‌వ‌ర్ ప్లేలో దంచిన‌ ష‌ఫాలీ వ‌ర్మ(20), స్మృతి మంధాన‌(6)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. దాంతో మ‌రోసారి కెప్టెన్ హ‌ర్మనప్రీత్ కౌర్(9), జెమీమా రోడ్రిగ్స్(16)లు ఇన్నింగ్స్ నిర్మించే ప్రయ‌త్నం చేశారు. కానీ, మేగ‌న్ ష‌ట్ వేసిన ఆరో ఓవ‌ర్లో జెమీమా భారీ షాట్ ఆడి గార్డ్‌న‌ర్ చేతికి చిక్కింది. ఇక హర్మన్ ప్రీత్ కౌర్ 54/47 (నాటౌట్) కెప్టెన్ ఇన్సింగ్ ఆడగా.. దీప్తి శర్మ 29/25 తన వంతు జట్టును విజయానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. వీరి పార్టనర్ షిప్ బ్రేక్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు వచ్చినట్లే పెవిలియన్ చేరడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి టీమిండియా కేవలం 142 పరుగులు మాత్రమే చేయగలింది. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సెమీస్‌కు చేరిన ఆసీస్..

యూఏఈలోని షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో టాస్ గెలిసి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు సాధించింది. అయితే, ప‌వ‌ర్ ప్లేలో రేణుకా సింగ్(2/24) విజృంభ‌ణ‌తో కాస్త ఒత్తిడికి గురైన కంగారూ జ‌ట్టు.. సెంచరీ కొట్టడం కష్టమే అనిపించింది. కానీ, గ్రేస్ హ్యారిస్(40), త‌హ్లియా మెక్‌గ్రాత్(32), ఎలీసా పెర్రీ(32)లు దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరును చేయగలిగింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన హర్మన్ ప్రీత్ సేనను.. ఆసీస్ బౌలర్లు అన్నబెల్ (22/2), సోఫీ (32/2) వికెట్లు తీసి టీమిండియాను కూల్చారు. ఫలితంగా 9 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టు గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు క్వాలిఫై అయ్యింది. ఇక గ్రూప్ -బి నుంచి ఇంగ్లండ్, వెస్టీండీస్, సౌతాఫ్రికా నుంచి ఏ జట్టు సెమీస్‌కు చేరుకుంటుందో.. ఆ జట్టుతో ఆస్ట్రేలియా సెమీస్‌-1లో తలపడనుంది. కాగా, ప్రపంచకప్ టోర్నీల్లో ఆస్టేలియా ఉమెన్స్ జట్టు ఇప్పటికే 6 సార్లు వరల్డ్ కప్ నెగ్గిన విషయం తెలిసిందే.

స్కోరుబోర్డు :

ఆస్ట్రేలియా మహిళా జట్టు : 151/8 (20ఓవర్లు)

బ్యాటింగ్ : గ్రేస్ హ్యారీస్ 40 (సి) స్మృతి మంధాన (బి) దీప్తి శర్మ, బెత్ మూనీ 2 (సి) రాధా యాదవ్ (బి) రేణుకాసింగ్, జార్జియా వెర్హమ్ 0 (ఎల్బీ) (బి) రేణుకాసింగ్, తహీలా మెగ్రత్ 32 (స్టంప్) రిచాఘోశ్ (బి) రాధా యాదవ్, ఎలీస్సీ పెర్రీ 32 (సి అండ్ బి) దప్తీ శర్మ , ఆష్లీ గార్డెనర్ 6 (సి) రాధా యాదవ్ (బి) పూజా వస్త్రాకర్, ఫోయిబీ లిచ్ ఫీల్డ్ 15 (నాటౌట్), అన్నబెల్ సతర్ లాండ్ 10 (బి) శ్రేయాంక పాటిల్, సోఫీ మోలినెక్స్ 0 (రనౌట్ జెమ్మియా రోడ్రిగ్స్), మెగాన్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు : 14

వికెట్ల పతనం : 17-1,17/2, 79/3, 92-4,101-5,134-6,145-7,145-8

బౌలింగ్ : రేణుకా సింగ్ (4-0-24-2), శ్రేయాంక పాటిల్ (4-0-32-10), పూజా వస్త్రాకర్ (3-0-22-1), అరుంధతి రెడ్డి (3-0-24-0), దీప్తి శర్మ (4-0-28-2), రాధా యాదవ్ (2-0-14-1)

భారత మహిళల జట్టు : 142/ 9 (20ఓవర్లు)

బ్యాటింగ్ : షెఫాలీ వర్మ 20 (సి) అన్నబెల్ (బి) ఆశ్లే గార్డెనర్, స్మృతి మంధాన 6 (డబ్ల్యూ) సోఫీ మోలినక్స్, జెమ్మీయా రోడ్రిగ్స్ 16 (సి) ఆశ్లే (బి) మెగాన్, హర్మన్ ప్రీత్ కౌర్ 54 (నాటౌట్), దీప్తి శర్మ 29 (సి) జార్జియా (బి) సోఫీ, రిచా ఘోష్ 1 (రనౌట్) ఫోయిబీ, పూజా వస్త్రాకర్ 9 (బి) అన్నబెల్, అరుంధతి రెడ్డి 0 (రనౌట్) ఫోయిబీ, శ్రేయాంకపాటిల్ 0 (బెత్ మూనీ), రాధాయాదవ్ 0 (ఎల్బీడబ్ల్యూ) అన్నబెల్, రేణుకాసింగ్ 1 (నాటౌట్), ఎక్స్‌ట్రాలు : 6

వికెట్ల పతనం : 26-1, 39-2,47-3,110-4,111-5,139-6,139-7,141-8, 141-9

బౌలింగ్ : మెగన్ షట్ (4-0-25-1), ఆశ్లే గార్డెనర్ (4-0-32-1), అన్నబెల్ (4-0-22-2), సోఫీ (4-0-32-2), జార్జియా వెర్హమ్ (3-0-22-0), డార్సీ బ్రోన్ (1-0-8-0)

Tags:    

Similar News