టీమిండియా మహిళా జట్టుపై మిథాలీ రాజ్ సీరియస్!

టీ20 మహిళా ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శనపై భారత జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సీరియస్ అయ్యారు. గత మూడేళ్లుగా టీమిండియా మహిళల క్రికెట్లో ప్రగతి లేదని..

Update: 2024-10-16 19:31 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 మహిళా ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శనపై భారత జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సీరియస్ అయ్యారు. గత మూడేళ్లుగా టీమిండియా మహిళల క్రికెట్లో ప్రగతి లేదని.. తాజాగా ప్రదర్శనే ఇందుకు కారణమన్నారు. సుదీర్ఘకాలం హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్సీగా ఉన్నా.. ఐసీసీ టోర్నీల్లో జట్టు టైటిట్ ఎందుకు గెలువలేకపోతున్నదని మిథాలీ రాజ్ ప్రశ్నించింది. ‘ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కచ్చితంగా నెగ్గాల్సింది. చివరిదాకా తెచ్చుకుని ఆఖర్లో విఫలమవుతున్నాం. హర్మన్‌ సారథ్యంలో గత మూడేళ్లలో టీమిండియా ఎలాంటి ప్రగతి సాధించలేదు. ప్రతి జట్టూ ముందుకెళ్తుంటే భారత్‌ వెనుకబడుతోంది. జట్టులో స్థిరత్వం మిస్ అయ్యింది. ఓపెనర్లు ఆడితే మిడిలార్డర్ ఆడటం లేదు. మిడిలార్డర్‌ బాగుంటే ఓపెనింగ్‌ బాగుండట్లేదు. ఏళ్ల తరబడి ఇదే కథ. జట్టు కూర్పు కూడా టీ20 వరల్డ్ ఓటమికి ఒక కారణం. నేనైతే భారత్‌కు యువ కెప్టెన్‌ ఉండాలని ఆశిస్తు్న్నాను. దీనిపై సెలక్టర్లే నిర్ణయం తీసుకోవాలి’ అని మిథాలీ రాజ్ పేర్కొంది.

హర్మన్ ప్రీత్‌కు కెప్టెన్సీకి గండం..

టీ20 ఉమెన్స్ వరల్ట్ కప్‌లో భారత జట్టు సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించిన విషయం తెలిసిందే. దీంతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె కెప్టెన్సీకి తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ ప్రధాన కోచ్‌ అమోల్ మజుందార్, సెలక్షన్ కమిటీతో భేటీ కానుందని సమాచారం. హర్మన్‌‌ను కెప్టెన్‌గా కొనసాగించాలా? వద్దా? అనేది త్వరలో తేలనుంది. ‘టీ20 ప్రపంచకప్‌లో భారత ఉమెన్స్ జట్టు ప్రదర్శన ఆశాజనకంగా లేదు. హర్మన్‌ సారథ్యంపై మాజీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో కొత్త కెప్టెన్‌ను నియమించాలా? హర్మన్‌ను కొనసాగించాలా? అనేది ఇప్పుడే చెప్పలేం. జట్టు భవిష్యత్ కోసం అవసరమైతే కొత్త సారధి ఎంపికపై బీసీసీఐ వెనకడుగు వేయదు. అందుకు కోచ్‌, సెలక్షన్ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని బోర్డు వర్గాలు వెల్లడించాయి. కాగా, తదుపరి టీమిండియా కెప్టెన్ రేసులో స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News