Champions trophy : అరుదైన ఘనత సాధించిన రోహిత్.. ధోనీ తర్వాత అతనే
చాంపియన్స్ ట్రోఫీ విజయంతో భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీ విజయంతో భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ క్రికెటర్ ఎం.ఎస్ ధోనీ తర్వాత ఒకటి కంటే ఎక్కువ ఐసీసీ టైటిల్స్ గెలిచిన భారత సారథిగా నిలిచాడు. ధోనీ సారథ్యంలో భారత్ 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. గతేడాది టీమిండియాను టీ20 వరల్డ్ కప్ చాంపియన్‌గా నిలిపిన రోహిత్.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ అందించాడు. మొత్తంగా వరల్డ్ క్రికెట్‌లో ఒకటి ఎక్కువ ఎక్కువ ఐసీసీ టైటిల్స్ గెలిచిన 6వ సారథిగా నిలిచాడు. అత్యధిక ఐసీసీ టైటిల్స్ నెగ్గిన కెప్టెన్‌గా రికార్డు ఆసిస్ మాజీ సారథి రికీ పాంటింగ్(4) పేరిట ఉంది. ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు. విండీస్‌కు చెందిన మాజీ కెప్టెన్లు క్లైవ్ లాయిడ్, డారిన్ సామీ, ఆసిస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఖాతాలో రెండు ఐసీసీ టైటిల్స్ ఉన్నాయి.