శభాష్ అమ్మాయిలు.. టీ20 మహిళా ప్రపంచ కప్‌లో భారత్‌కు రెండో విజయం

దిశ, స్పోర్ట్స్ : టీ20 మహిళా ప్రపంచకప్‌‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. తొలి మ్యాచులో న్యూజిలాండ్‌తో ఓటమిని చవిచూశాక.. భారత మహిళా జట్టు చాలా వేగంగా పుంజుకుంది. మొన్న పాకిస్తాన్, నేడు శ్రీలంక జట్ల మీద ఘన విజయం సాధించి సెమీస్ ఆశలను సజీవం చేసుకుంది.

Update: 2024-10-09 20:14 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 మహిళా ప్రపంచకప్‌‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. తొలి మ్యాచులో న్యూజిలాండ్‌తో ఓటమిని చవిచూశాక.. భారత మహిళా జట్టు చాలా వేగంగా పుంజుకుంది. మొన్న పాకిస్తాన్, నేడు శ్రీలంక జట్ల మీద ఘన విజయం సాధించి సెమీస్ ఆశలను సజీవం చేసుకుంది. ఇదే ఊపుతో రాణిస్తే ఈసారి టీమిండియా ఉమెన్స్ టీం కచ్చితంగా ప్రపంచకప్‌ను ముద్దాడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బుధవారం యూఏఈ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుని.. నిర్ణీత 20 ఓవర్లలో 172/3 పరుగులు సాధించింది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక కేవలం 19.5 ఓవర్లలో 90 పరుగులు మాత్రమే చేయగా.. 82 పరుగుల భారీ తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అంతేకాకుండా నెట్ రన్‌రేట్ కూడా మెరుగుపరుచుకుంది.

మంధాన, హర్మన్ ప్రీత్ హాఫ్ సెంచరీ!

శ్రీలంకతో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచులో భారత ఓపెనర్లు స్మృతి మంధాన‌(50), షెఫాలీ వ‌ర్మ(43) అదిరే ఆరంభం ఇవ్వగా.. కెప్టెన్ హ‌ర్మన్‌ప్రీత్ కౌర్ (52 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి బౌల‌ర్లకు చుక్కలు చూపెట్టింది. అనంతరం బౌల‌ర్లు అరుంధ‌తి రెడ్డి (3/19), ఆశా శోభ‌న‌ (3/19)లు లంక బ్యాట‌ర్ల భరతం పట్టారు. ఫీల్డింగ్‌లోనూ అమ్మాయిలు కట్టుదిట్టంగా వ్యవహరించడంలో టీమిండియా సులభంగా విజయం సాధించింది.

కుప్పకూలిన లంక జట్టు..

ఇక ఛేద‌న‌కు దిగిన శ్రీ‌లంక‌కు తొలి ఓవ‌ర్లోనే రేణుకా షాకిచ్చింది. రెండో బంతికే విశ్మీ గౌత‌మ్(0)ను డకౌట్ చేసింది. విశ్మీ ఆడిన బంతిని రాధాయాద‌వ్ క్యాచ్ పట్టింది. లంక కెప్టెన్ చ‌మ‌రి ఆట‌పట్టు (1)ను శ్రేయాంక వెన‌క్కి పంపింది. స్లిప్‌లో దీప్తి శ‌ర్మ చ‌క్కని క్యాచ్ ప‌ట్టగా లంక 4 ప‌రుగుల‌కే రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రేణుకా స్వింగ్‌తో స‌మ‌ర‌వ‌క్రమ‌ (3)ను ఔట్ చేయగా.. ఐదో వికెట్‌కు 14 ర‌న్స్ జోడించిన నీలాక్షి డిసిల్వా (8), క‌విశ‌ దిల్హరి (21)ని ఆఖ‌రి బంతికి అరుంధ‌తి రెడ్డి ఔట్ చేయ‌డంతో 58 వ‌ద్ద లంక ఆరు వికెట్లు ప‌డ్డాయి. ప్రధాన బ్యాట‌ర్లు డ‌గౌట్ చేర‌గా అరుంధ‌తి రెడ్డి(3/19) ఆశా శోభ‌న‌(3/19)ల జోరుతో టెయిలెండ‌ర్లు కూడా చేతులెత్తేశారు.

ఆసీస్‌ను ఓడిస్తేనే సెమీస్‌పై ఆశలు..

తొలి మ్యాచ్‌ న్యూజిలాండ్ చేతిలో ఓట‌మి.. ఆ తర్వాత పాకిస్థాన్‌పై గెలుపు, తాజాగా మాజీ ఆసియా క‌ప్ విజేత శ్రీలంక‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలి ఓటమి తర్వాత హర్మన్ ప్రీత్ సేన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చింది. సెమీస్ చేర‌డం కోసం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఓపెన‌ర్లు ష‌ఫాలీ వ‌ర్మ(43), స్మృతి మంధాన‌(50)లు ప‌వ‌ర్ ప్లేలో దంచికొట్టారు. ఆ త‌ర్వాత కెప్టెన్ హ‌ర్మన్‌ప్రీత్ కౌర్ జ‌ట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యత తీసుకున్నారు. కాగా, టీమిండియా సెమీస్ చేరాలంటే ఈనెల 13న ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధించాల్సి ఉంటుంది. లేనియెడల ఇతర జట్ల జయపరాజయాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

స్కోరుబోర్డు :

భారత మహిళల జట్టు : 172/3 (20 ఓవర్లు)

బ్యాటింగ్ : షెఫాలీ వర్మ 43 (సి) విష్మీ (బి) చమరి అటపట్టు, స్మృతిమంధాన 50 (రనౌట్) అమ కంచనా, హర్మన్ ప్రీత్ కౌర్ 52 (నాటౌట్), జెమ్మియా రోడ్రిగ్స్ 16 (సి) ప్రబోధిని (బి) అమ కంచనా, రిచా ఘోష్ 6(నాటౌట్), ఎక్స్‌ట్రాలు : 5

వికెట్ల పతనం : 98-1, 98-2, 128-3

బౌలింగ్ : ఇనోషి ప్రియదర్శిని (2-0-11-0), సుగంధిక కుమారి (3-0-32-0), ఉదేశిక ప్రబోధిని (3-0-11-0), కవిషా దిల్హారీ (2-0-11-0), ఇనోక రనవీరా (3-0-26-0), చమరి ఆటపట్టు (4-0-34-1), అమ కంచనా (3-0-29-1)

శ్రీలంక స్కోర్ బోర్డు : 90/10 (19.5 ఓవర్లు)

బ్యాటింగ్ : విష్మీ గునరత్నే 0 (సి అండ్ బి) రేణుకా సింగ్, చమరి ఆటపట్టు 1 (సి) దీప్తి శర్మ (బి) రేణుకా, హర్షిత సమరవిక్రమ 3 (సి) రిచాఘోష్ (బి) రేణకా, కవిషా దిల్హారీ 21 (సి) రేణుకా (బి)అరుంధతి రెడ్డి, అనుష్క సంజీవనీ 20 (స్టంప్) రిచా ఘోష్ (బి) ఆషా శోభన, నికాశీ డి సిల్వ 8 (సి) షెఫాలీ (బి) అరుంధతి, అమ కంచన 19 ( సి అండ్ బి) అరుంధతి, సుగంధకుమారి 1 (సి) రిచా (బి) ఆషా, ఇనోషి ప్రియదర్శిని 1 (సి అండ్ బి) ఆశా, ఉదేశికా ప్రబోధిని 9 ( సి) స్మృతి మంధాన (బి) దీప్తి శర్మ, ఇనోక రనవీరా 2 (నాటౌట్), ఎక్ర్ ట్రాలు : 5

వికెట్ల పతనం : 0-1,4-2,6-3,43-4,57-5,58-6,61-7,65-8,86-9,90-10

బౌలింగ్ : రేణుకాసింగ్ (4-0-16-2), శ్రేయాంక పాటిల్ (4-0-15-1), దీప్తి శర్మ (3.5-0-16-1), అరుంధతి రెడ్డి (4-0-19-3), ఆశా శోభన (4-0-19-3) 

Tags:    

Similar News