కొంపముంచిన చిన్ననాటి స్నేహం.. కూతురికి బంపర్ ఆఫర్, తండ్రికి దారుణ శిక్ష..!

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత సమాజంలో జరిగే నేరాలకు మేజర్ కారణం ‘ఒకటి డబ్బు అయితే.. మరొకటి ప్రేమ’.. ముఖ్యంగా ఈ రెండింటి కోసమే జనాలు ఒకరినొకరు చంపుకుంటున్నారు లేదా చస్తున్నారు.. తాజాగా తాను ప్రేమించిన అమ్మాయి పెళ్లికి అంగీకరించలేదనే కారణంతో చిన్ననాటి స్నేహితుడే ఆ యువతి తండ్రిని నడిరోడ్డుపై దారుణంగా హత్యచేశాడు. అడ్డుకోవడానికి వచ్చిన యువతి సోదరుడిపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు రూరల్‌ జిల్లాలోని బెటనగెరెలో మంగళవారం వెలుగుచూసింది. […]

Update: 2021-08-25 08:07 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత సమాజంలో జరిగే నేరాలకు మేజర్ కారణం ‘ఒకటి డబ్బు అయితే.. మరొకటి ప్రేమ’.. ముఖ్యంగా ఈ రెండింటి కోసమే జనాలు ఒకరినొకరు చంపుకుంటున్నారు లేదా చస్తున్నారు.. తాజాగా తాను ప్రేమించిన అమ్మాయి పెళ్లికి అంగీకరించలేదనే కారణంతో చిన్ననాటి స్నేహితుడే ఆ యువతి తండ్రిని నడిరోడ్డుపై దారుణంగా హత్యచేశాడు. అడ్డుకోవడానికి వచ్చిన యువతి సోదరుడిపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు రూరల్‌ జిల్లాలోని బెటనగెరెలో మంగళవారం వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. ఆరతి (పేరు మార్చాం), నరేష్ (28) చిన్ననాటి స్నేహితులు. ఇరు కుటుంబాలు కూడా ఒకరినొకరికి తెలుసు. అయితే, సోమవారం సాయంత్రం నరేష్ తన ప్రేమ విషయాన్ని ఆరతికి చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. అదే రోజురాత్రి మరోసారి ఆరతి ఇంటికి నరేష్ వెళ్లగా ఆమె తల్లిదండ్రులు అతన్ని అక్కడి నుంచి పంపించివేశారు. అయితే, పేరెంట్స్ వల్లే చిన్ననాటి స్నేహితురాలు తన ప్రేమను అంగీకరించడం లేదని నరేష్ అనుమానించడంతో పాటు కోపం పెంచుకున్నాడు.

మంగళవారం తెల్లవారు జామున ఆరతి తండ్రి నాగప్ప తన కుమారుడు సాగర్‌తో కలిసి బస్టాండ్ వైపు వెళుతుండగా.. నరేష్ మరియు అతని సహచరులు బైక్ ఆపి ఇనుప రాడ్‌తో నాగప్పపై దాడి చేశారు. తన తండ్రిని కాపాడటానికి సాగర్ ప్రయత్నించగా.. అతనిపై కూడా నిందితుడు మరియు అతని ఫ్రెండ్స్ దాడి చేశారు.

నాగప్పకు తీవ్రగాయాలు గావడంతో కిందపడిపోగా, అనుమానితులు అక్కడి నుంచి బైక్ మీద పరారయ్యారు. సాగర్ అంబులెన్స్‌ను పిలువగా, వాహనం రాకముందే నాగప్ప తుది శ్వాస విడిచాడు. మృతుడు బెట్టనగెరెలోని కువెంపునగర్‌లో భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి నివాసముంటున్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దాడికి గల కారణాలపై ఆరా తీశారు. నిందితుడు నరేష్ మరియు అతని సహచరులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, నిందితులు పరారీలో ఉన్నట్టు సమాచారం.

Tags:    

Similar News