సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ.. ఏమన్నారంటే !
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మూడు నెలల నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో భవన నిర్మాణాలు, రియల్ఎస్టేట్రంగం కుదేలైందని కాంగ్రెస్ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు చేయాలనే నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమన్నారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌కు ఎంపీ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలకు పూనుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వెబ్సైట్ప్రజలకు ఇబ్బందిగా మారిందని, ధరణి ప్రకారం పాస్‌బుక్‌లు […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మూడు నెలల నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో భవన నిర్మాణాలు, రియల్ఎస్టేట్రంగం కుదేలైందని కాంగ్రెస్ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు చేయాలనే నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమన్నారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌కు ఎంపీ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలకు పూనుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వెబ్సైట్ప్రజలకు ఇబ్బందిగా మారిందని, ధరణి ప్రకారం పాస్‌బుక్‌లు తల్లిదండ్రుల నుంచి వారసుల పేరు మీదకు మారాలంటే ఒక్కో ఎకరాకు రూ. 3వేలు రైతుపై భారం పడుతుందన్నారు. రిజిస్ట్రేషన్లపై వెనక్కి తగ్గినట్టే ఎల్ఆర్ఎస్‌పై వెనక్కి తగ్గాలని కోరారు.