సరిపోదా శనివారం నుంచి సెకండ్ లుక్.. బైక్ పై వెళ్తున్న నాని సంతోషానికి కారణం ఏంటి?
వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న నేచురల్ నాని గురించి ఎంత చెప్పిన తక్కువే.
దిశ, సినిమా: వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న నేచురల్ నాని గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన కష్టంతో పైకి వచ్చిన నానిని చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇక, సినిమాల విషయానికొస్తే వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన మూవీ ‘సరిపోదా శనివారం’ మూవీ మనందరికీ తెలుసు. ఇంతక ముందు ఈ మూవీ నుంచి షేర్ చేసిన ఫస్ట్ లుక్ బాగా వైరల్ అయింది. ఫస్ట్ సింగిల్ గరం గరం పాట కూడా వచ్చిన విషయం మనకి తెలిసిందే. తాజాగా, ఈ మూవీ మేకర్స్ సెకండ్ లుక్‌ను రిలీజ్ చేశారు.
నాని బైక్ పై హ్యాండ్ బ్యాగ్ వేసుకొని కూల్ గా వెళ్తున్న సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ లుక్ ని చూసి నెటిజెన్స్ నాని ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ఏంటని తెగ ఆలోచిస్తున్నారు. కొద్దీ రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుంది. ఈ మూవీలో ప్రియాంక ఆరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి కాంబోలో గ్యాంగ్‌లీడర్ తర్వాత ఇది రెండో సినిమా.
ఈ సినిమాలో ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కిస్తోంది.
Every raging Saturday has its calm counterpart 😎
— DVV Entertainment (@DVVMovies) July 4, 2024
Now, Experience a new dimension of Surya on other days ❤️#SaripodhaaSanivaaram #SuryasSaturday
Natural 🌟 @NameIsNani @iam_SJSuryah @priyankaamohan #VivekAthreya @JxBe@muraligdop @karthikaSriniva @SVR4446 @IamKalyanDasari… pic.twitter.com/UngM0bMWum