అందరూ ఇష్టపడే చిరంజీవిలో .. ఆ చెడ్డ అలవాటు ఉందా?
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన స్వయంకృషితో పైకి వచ్చారు. తన నటన, హార్డ్ వర్క్‌తో టాలీవుడ్ మెగాస్టార్‌గా నిలిచారు. ఇక చిరు ఎప్పుడు చాలా సాఫ్ట్‌గా
దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన స్వయంకృషితో పైకి వచ్చారు. తన నటన, హార్డ్ వర్క్‌తో టాలీవుడ్ మెగాస్టార్‌గా నిలిచారు. ఇక చిరు ఎప్పుడు చాలా సాఫ్ట్‌గా, చిరుతనవ్వుతో అందరినీ పలకరిస్తూ.. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అందుకే ఈయన అంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది. చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ఈయన తన సపోర్ట్‌ను అందిస్తాడు. అందు వల్ల ప్రతి ఒక్కరూ ఈయనను ఆదర్శంగా తీసుకోవడమే కాకుండా అన్నయ్య అని ప్రేమగా పిలుస్తారు. కొంత మంది చిరును టాలీవుడ్ దేవుడు అని కూడా అంటారు.
అయితే అందరూ దేవుడుగా భావించే చిరులో కూడా ఓ బ్యాడ్ క్వాలిటీ ఉన్నదంటున్నారు కొందరు. ఇంతకీ అదేంటీ అనుకుంటున్నారా? చిరు రూడ్‌గా మాట్లాడటం, ఇతర క్యారెక్టర్స్ పై నోరు పారేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. అందరినీ నవ్వుతూ పలకరిస్తాడు. అయితే ఇదే మంచిది కాదు అంటున్నారు కొందరు. మంచితనం ఉండాలి కానీ దానికి ఓ హద్దు అనేది ఉంటుంది. అతి మంచితనం చూపిస్తే అది మనకే ఎఫెక్ట్ అవుద్దీ అది ఎప్పటికీ పనికి రాదు. చిరంజీవిలో ఇదో బ్యాడ్ క్వాలిటీ అంటున్నారు ఆయన అభిమానులు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.