Sai Pallavi: క్రేజీ ఆఫర్ కొట్టేసిన సాయి పల్లవి.. ఏకంగా గ్లోబల్ స్టార్‌తో రోమాన్స్..?

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-11-25 09:22 GMT

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Shiva Karthikeyan) సరసన ‘అమరన్’(Amaran) మూవీలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) హీరోగా నటిస్తోన్న ‘తండేల్’(Tandel) మూవీతో పాటు, ‘రామాయణం’(Ramayanam) సినిమాలో నటిస్తోంది. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

తాజాగా సాయి పల్లవి మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందట. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌(Ram Charan)తో దర్శకుడు సుకుమార్(Sukumar) ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. ఇక 2025 ఎండింగ్‌లో మొదలు కానున్న ఈ సినిమాలో సాయి పల్లవిని తీసుకోనున్నారట మేకర్స్. దీనికి ఈ అమ్మడు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఇటు మెగా ఫ్యాన్స్, సాయి పల్లవి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Read more...

మెగా కోడలు కాబోతున్న మరో టాలీవుడ్‌ బ్యూటీ ?.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన న్యూస్..!


Tags:    

Similar News