CM Revanth Reddy: మన్మోహన్ సింగ్‌కి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ నేతల నివాళి

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాళులు అర్పించారు.

Update: 2024-12-27 10:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) పార్థివదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాళులు అర్పించారు. ఢిల్లీలోని మన్మోహన్‌ నివాసానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ మాజీ ప్రధాని పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. సీఎం వెంట పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ (Deepadas Munshi), మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarsimha), ఎంపీలు మల్లు రవి, బలరామ్ నాయక్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్, పార్టీ నేతలు సంపత్ కుమార్, జేడీ శీలం తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మన్మోహన్‌ సింగ్‌ తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మాజీ ప్రధాని భౌతికకాయాన్ని సందర్శనార్థం ఆయన నివాసంలో ఉంచారు. ఈ క్రమంలోనే ఉదయం నుంచి పలువురు రాజకీయ ప్రముఖులు మన్మోహన్‌కు నివాళులర్పిస్తున్నారు.

Tags:    

Similar News