BIG News: మందుబాబులకు భారీ గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ వేళ సర్కార్ కీలక నిర్ణయం

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ (New Year Celebrations)కు ప్రపంచమంతా సిద్ధం అవుతోంది.

Update: 2024-12-28 02:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ (New Year Celebrations)కు ప్రపంచమంతా సిద్ధం అవుతోంది. కొత్త ఏడాదికి గ్రాండ్‌గా వెల్‌కం చెప్పేందుకు డిసెంబర్ 31న మందుబాబులు మందేసి చిందేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో సైతం పెద్ద ఎత్తున న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ (New Year Celebrations)కు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ (Telangana Government) మందుబాబులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31న రాష్ట్రంలోని వైన్ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉండనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ (Excise Department) ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాకుండా రాష్ట్రంలోని పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు న్యూ ఇయర్ సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ (State Government) అనుమతితో నడిచే ఈవెంట్లకు రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. ముఖ్యంగా ఈవెంట్లలో డ్రగ్స్ వినియోగించకుండా ఆంక్షలు విధించింది. GHMC పరిధిలోని ఈవెంట్లు, పార్టీలపై నిఘా ఉండాలని పోలీసులకు సూచించింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సర్కార్‌కు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. 

Tags:    

Similar News