Maoists: ఆ ఇద్దరు వనం వీడి జనంలోకి రావాలి.. ములుగు SP శబరీష్ పిలుపు
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కుటుంబాల(Maoist Families)ను ములుగు SP శబరీష్(SP Sabarish) పరామర్శించారు.
దిశ, వెబ్‌డెస్క్: అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కుటుంబాల(Maoist Families)ను ములుగు SP శబరీష్(SP Sabarish) పరామర్శించారు. శుక్రవారం జిల్లాలోని తాడ్వాయి మండలం కాల్వపల్లిలోని మావోయిస్టు నేతలైన బడే చొక్కారావు(Bade Chokka Rao), కొయ్యాడ సాంబయ్య(Koyyada Sambaiah) ఇళ్లకు వెళ్లి మాట్లాడారు. ఈ సందర్భంగా బడే చొక్కారావు తల్లి బతుకమ్మ(Bathukamma)కు నిత్యవసర సరుకులు అందజేశారు. అనంతరం గోవిందరావుపేట మండలం మొద్దులగూడెంలోని సాంబయ్య ఇంటికి వెళ్లి.. సాంబయ్య భార్య సుజాతతో మాట్లాడి నిత్యవసర సరుకులు అందజేశారు. బడే చొక్కారావు, సాంబయ్యలు వనం వీడి జనంలోకి రావాలని పిలుపునిచ్చారు. వారిద్దరి మీదున్న రివార్డులతో పాటు ఇళ్లు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బడే చొక్కారావు కొనసాగుతునట్లు సమాచారం.