India- West Indies : విండీస్ తో వన్డే సిరీస్ లో భారత్ క్లీన్ స్వీప్
వెస్టిండీస్- భారత(India- West Indies) మహిళా క్రికెట్ జట్ల(Women's cricket teams) మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
దిశ, వెబ్ డెస్క్ : వెస్టిండీస్- భారత(India- West Indies) మహిళా క్రికెట్ జట్ల(Women's cricket teams) మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మూడో వన్డేలో భారత మహిళ జట్టు విండీస్ టీమ్ నిర్థేశించిన 163పరుగుల లక్ష్యాన్ని 28.2ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో దీప్తి శర్మ(39)పరుగులతో రాణించింది. హర్మన్ ప్రీత్ కౌర్ 32, జెమీమా రోడ్రిగ్స్ 29, రిచా ఘోష్ 23పరుగు చేయగా, చివర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి విజయాన్ని అందించింది.
అంతకుముందు బౌలింగ్ లోనూ రాణించిన దీప్తి శర్మ ఏకంగా 6 విండిస్ వికెట్లు సాధించి అల్ రౌండ్ ప్రతిభతో మెరిసింది. రేణుకాసింగ్ 4 వికెట్లు సాధించింది. దీంతో విండీస్ జట్టు 163పరుగులకే ఆలౌటైంది. విండీస్ జట్టు బ్యాటర్లలో చినెల్లె హెన్రీ 61, క్యాంపెబె్ 46పరుగులు చేశారు. విండీస్ ఓపెనర్లు క్వినా జోసెఫ్, హేలీ మాథ్యూస్ లను రేణుకా తొలి ఓవర్ లోనే డకౌట్ చేసింది.