BGT 2024 : కోహ్లీతో ఆసీస్ ఫ్యాన్స్ దురుసు ప్రవర్తన..
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ కోహ్లీతో ఆసీస్ అభిమానులు దురుసుగా ప్రవర్తించారు.
దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ బ్యాట్స్‌మెన్ కోహ్లీతో ఆసీస్ అభిమానులు దురుసుగా ప్రవర్తించారు. నాలుగో టెస్ట్ రెండో రోజు కోహ్లీ ఔట్ అయి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తుండగా ఎంసీజీ మైదానంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. 102 పరుగుల భాగస్వామ్యం అనంతరం జైస్వాల్ రనౌట్ అయ్యాడు. తర్వాత కేవలం 7 బంతుల్లోనే కోహ్లీ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సందర్భంగా గ్రౌండ్ వదిలి వెళ్తుండగా ఆస్ట్రేలియా ఫ్యాన్స్ కోహ్లీని ఎగతాళి చేశారు. మాటలు, చేతలతో విరాట్‌ను కవ్వించారు. ఇదది గమనించిన కోహ్లీ వెనుదిరిగి వచ్చి వారి వైపు కోపంగా చూశాడు. అక్కడే ఉన్న ఆస్ట్రేలియా సెక్యూరిటీ అధికారి కలగజేసుకుని విరాట్‌కు నచ్చజెప్పాడు. లోపలికి వెళ్లాలని రిక్వెస్ట్ చేశాడు. దీంతో కోహ్లీ గ్రౌండ్ వదిలి వెళ్లాడు. తొలి రోజు ఆట సందర్భంగా కోహ్లీ-కొన్ స్టాస్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కొన్‌స్టాస్ భుజం తగలడంతో ఐసీసీ సైతం కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది.