IND Vs AUS: మరోసారి అదరగొడుతోన్న నితీష్ రెడ్డి.. భారీ స్కోర్ దిశగా టీమిండియా

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా మెల్‌బోర్న్ (Melbourne) వేదిక‌గా జ‌రుగుతోన్న బాక్సింగ్ డే (Boxing Day) టెస్ట్ రసవత్తరంగా కొనసాగుతోంది.

Update: 2024-12-28 05:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా మెల్‌బోర్న్ (Melbourne) వేదిక‌గా జ‌రుగుతోన్న బాక్సింగ్ డే (Boxing Day) టెస్టు రసవత్తరంగా కొనసాగుతోంది. అసిస్ తొలి ఇన్సింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, బ్యాటింగ్ వచ్చిన భారత జట్టు వరసగా వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashaswi Jaiswal) (82) పరుగులతో అదగొట్టాడు. రనౌట్ అయి తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ (KL Rahul) (24), విరాట్ కోహ్లీ (Virat Kohli) (36) నెమ్మదిగా ఆడినప్పటికీ క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. అదేవిధంగా జట్టు సారథి రోహిత్ శర్మ (Rohith Sharma) మరోసారి నిరాశపరిచాడు. 5 వికెట్లు 164 పరుగులతో నైట్ స్కోర్‌తో మూడో రోజు బ్యాటింగ్‌ను ఆరంభించిన టీమిండియా (Team India) వరుసగా రిషభ్ పంత్ (Rishabh Pant) (28), రవీంద్ర జడేజా (Ravindra Jadeja) (17) వికెట్లను కోల్పోయింది.

తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) మరోసారి దూకుడుగా ఆడుతూ ఆసిస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదర్కొంటున్నాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరిగెత్తిస్తున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న ఆల్‌‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ నితీష్ దన్నుగా క్రీజ్‌లో నిలబడ్డాడు. ప్రస్తుతం టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి 149 బంతుల్లో 89 పరుగులు, వాషింగ్టన్ సుందర్ (144 బంతుల్లో 49 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఆసిస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 3, పాట్ కమిన్స్ 2, నాథన్ లయన్ ఇక వికెట్ తీసుకున్నారు. మరో 11 పరుగులు చేస్తే నితీష్ రెడ్డి తన కెరీర్‌లో మొదటి సెంచరీని నమోదు చేయనున్నాడు.    

Tags:    

Similar News