Gavaskar : పంత్ అవుట్ పై గవాస్కర్ తీవ్ర వ్యాఖ్యలు
అస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ టెస్టు(Australia vs India) సిరీస్ లోని నాల్గవదైన బాక్సింగ్ డే టెస్టు(4th Test)లో భారత బ్యాటర్ రిషబ్ పంత్(Rishabh Pant) అవుటైన(Out) తీరుపై మాజీ క్రికెటర్ గవాస్కర్ తీవ్ర విమర్శలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : అస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ టెస్టు(Australia vs India) సిరీస్ లోని నాల్గవదైన బాక్సింగ్ డే టెస్టు(4th Test)లో భారత బ్యాటర్ రిషబ్ పంత్(Rishabh Pant) అవుటైన(Out) తీరుపై మాజీ క్రికెటర్ గవాస్కర్ తీవ్ర విమర్శలు చేశారు. మ్యాచ్ లో కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న గవాస్కర్ పంత్ అవుటైన తీరుపై మండిపడుతూ స్టుపిడ్..స్టుపిడ్ (Stupid..Stupid)అంటూ పంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పంత్ తను అవుటైన షాట్ తన సహజ శైలిది కాదని, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అడాల్సిన విధానం అది కాదన్నారు. పంత్ భారత డ్రెస్సింగ్ రూమ్ కు రావద్ధంటూ వ్యాఖ్యానించారు.
అలాంటి స్టుపిడ్ షాట్ అడాలనుకుంటే 5వ స్థానంలో బ్యాటింగ్ కు రావద్ధని, టెస్టుల్లో ఓపిక తో ఆడటం చాల అవసరమని హితవు పలికారు. ఈ మ్యాచ్ లో పంత్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 28పరుగులకు అవుటవ్వగా, అప్పటికి భారత్ జట్టు ఫాలోఆన్ కూడా అధిగమించలేదు. జట్టుకు పంత్ రాణించడం ఎంతో అవసరమున్న సమయంలో బోలాండ్ బౌలింగ్ లో అనవసర షాట్ తో ఫిల్డర్లు ఉన్న చోటికే బంతికి కొట్టి లయన్ చేతికి చిక్కి వికెట్ పారుసుకున్నాడు.