PM Modi: చెస్ చాంపియన్ గుకేష్‌కు ప్రధాని మోడీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

చారిత్రాత్మక చెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్(World Chess Champion) విజయం తర్వాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi)తో శనివారం గుకేశ్‌(Gukesh) సమావేశమయ్యారు.

Update: 2024-12-28 14:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: చారిత్రాత్మక చెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్(World Chess Champion) విజయం తర్వాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi)తో శనివారం గుకేశ్‌(Gukesh) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుకేష్‌కు మోడీ చెస్ బోర్డును బహుమతిగా ఇచ్చారు. అనంతరం శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా(X) ద్వారా తెలియజేశారు. ఇటీవల స్టార్‌ నటుడు రజనీకాంత్‌ (Rajinikanth)ను గుకేశ్‌(D Gukesh) కలిశారు. రజనీ ఆహ్వానం మేరకు తల్లిదండ్రులతో కలిసి ఆయన ఇంటికి వెళ్లిన గుకేశ్‌ తలైవాను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను గ్రాండ్‌ మాస్టర్‌ ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు. విలువైన సమయాన్ని తనకోసం వెచ్చించిన రజనీకాంత్‌కు గుకేశ్‌ ధన్యవాదాలు తెలిపారు. మరో హీరో శివకార్తికేయన్‌ను కూడా గుకేశ్‌ కలిశారు.



 


Tags:    

Similar News